PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్ కళ్యాణమస్తు.. షాదీ తోఫా నిధులు జమ

1 min read

ఏలూరు జిల్లాలో  437 మంది లబ్ధిదారులకు రూ.3.52 కోట్ల ఆర్ధికసాయం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు,  వైయస్సార్ షాదీ తోఫా  కింద 477 మంది లబ్దిదారులకు రూ. 3..52 కోట్ల నిధులను లబ్దిదారుల ఖాతాలకు జమచేసినట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళ వారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 5 వ విడత వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద అక్టోబర్, డిసెంబర్ – 2023 త్రైమాసికంలో  వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు.  ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, సోషల్ వెల్ఫేర్ జె డి జయ ప్రకాష్, ఆర్డిఓ ఎన్ ఎస్ కె ఖాజావలి, మైనారిటీస్ అధికారి ఎన్ఎస్ కృపావరం, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి ఆర్.నాగరాణి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 437మంది జంటలకు రూ. 3.52 కోట్లు లబ్దిచేకూరిందన్నారు.  వీరిలో బిసి కులానికి చెందిన 198 మందికి రూ. 1,కోటి 13, లక్ష 50వేలు,  ఎస్సీలకు చెందిన 207 మందికి రూ. 2.కోట్ల, 9లక్షల , 80వేలు ఎస్టీలకు చెందిన 7 గురికి రూ 80 లక్షలు, మైనారిటీలకు చెందిన 20 మందికి రూ. 2లక్షల , 20వేలు విభిన్న ప్రతిభావంతులకు చెందిన 5 గురికి రూ. 75 వేలు ఆర్ధిక సహాయం అందిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫా ద్వారా నిరుపేదలైన ఆడపిల్లల వివాహానికి వారి తల్లిదండ్రులకు అందిస్తున్న ఈ ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నూతన వధూవరులు వారి జీవితాల్లో పరస్పరం మంచి భావాలతో సమాజంలో పేరుతెచ్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.  కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అందించే దిశగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగిస్తున్నారన్నారు.పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు, దివ్యాంగులు భవననిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ తోఫా ద్వారా అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని పేద తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చైర్ పర్సన్ తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికం లో వివాహం చేసుకున్న 10,132 జంటలకు రూ.78.53 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగామౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన విద్యా ప్రమాణాలను అందిస్తున్నదని తెలిపారు.  నవరత్నాల పధకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సదుపాయాలను కల్పించడం జరిగిందని చైర్ పర్సన్ తెలిపారు.  కార్యక్రమంలో  ఘంటా ప్రసాద్,పలువురు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author