NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన వైయస్సార్ పార్టీ నాయకులు,ప్రజలు

1 min read

– నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడినే మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం మీరాపురం గ్రామం సచివాలయం పరిధిలో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి యాగంటి దేవస్థానం చైర్మన్ తోట బుచ్చిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల ను వివరిస్తూ ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఏమైనా ఇంకా అందాల అని లబ్ధిదారులతో తెలుసుకుంటూ అలాగే గ్రామ సమస్యలను కూడా ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది.సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ 3,648 వేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన ఆనాటి ప్రతిపక్ష నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకోవడం జరిగిందని ఆ ప్రజల కష్టసుఖాల నుంచి పుట్టిందే నవరత్నాలు పథకాలు అని చెప్పారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో 98% మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. కేవలం ప్రజల ఓట్ల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాని హామీలను ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కే రాజకీయ పార్టీలను చూసాము గాని ఎన్నికల మేనిఫెస్టో ను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా ,ఒక ఖురాన్ గా భావించి ఇచ్చిన హామీలు లలో 98 శాతం హామీలను నెరవేర్చడం ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పారు. నిత్య ప్రజల కోసం పరితపించే ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రాజకీయాలకు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైయస్సార్ పార్టీని ఘనవిజయంతో గెలిపించాలని అలాగే బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా 2024లో మళ్లీ తానే పోటీచేస్తున్నానని కాబట్టి ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య, వైఎస్ఆర్సిపి నాయకుడు ప్రతాప్ రెడ్డి దస్తగిరి రెడ్డి యాగంటి దేవస్థానం పాలకమండలి చైర్మన్ తోట బుచ్చి రెడ్డి, యామ మనోహర్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,మల్లేష్ రెడ్డి, రాం మోహన్ రెడ్డి, యమ్మనూరు నీలేశ్వర్ రెడ్డి ,మదార్ సాహెబ్,ఈశ్వరయ్య,దేవ సహాయం, తిరుపాలు,వైయస్సార్పార్టీనాయకులు, కార్యకర్తలు,మండల అధికారులు,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,గృహ సారథులు పాల్గొన్నారు.

About Author