వైఎస్సార్ పింఛన్ కానుక..పేదలకు వరం
1 min read–డీఆర్డీఏ పీడీ సలీంబాష
- 1న ఠంఛన్‌గా పింఛన్ పంపిణీ
పల్లెవెలుగు, కర్నూలు:వైఎస్సార్ పింఛన్ కానుక పేదలకు వరం లాంటిదన్నారు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాష. నవంబరు 1 (బుధవారం)న ఉదయమే కర్నూలు జిల్లాల్లోని వృద్ధాప్య, వికలాంగ, వితంతువు పింఛన్లను పంపిణీ చేశారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు సచివాలయ పరిధిలో వైఎస్సార్ పింఛన్ కానుకలో భాగంగా యస్ హుస్సేన్ బీ (వృధ్ధాప్య పెన్షన్), ఉసేన్ బి( వితంతు పెన్షన్) లక్ష్మమ్మ (వృద్ధాప్య పెన్షన్) వి శేషన్న(వృధ్ధాప్య పెన్షన్) అన్వర్ భాష(శారీరిక వికలత్వం) కు వారి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ సలీంబాష మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబ సభ్యులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ కానుక ఎంతో సహాయ పడుతుందన్నారు. ప్రతి నెలా1వ తేదీన వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో(పెన్షన్స్) షరీఫ్ , పంచాయతీ సెక్రెటరీ,వెల్ఫేర్ అసిస్టెంట్ వాలంటీర్ తదితరులు పాల్గొన్నారు.