వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం మహిళలకు వరం…
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గర్బిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తోన్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమం మహిళలకు ఒక వరం అని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణ వేణి అన్నారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలోని 15 వ వార్డులో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని బైరెడ్డి నగర్ 18 ,31 అంగన్ వాడీ కేంద్రంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కృష్ణ వేణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నేడు అమలుచేస్తుందని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపంతో కలిగే రక్త హీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు వంటి ఆనారోగ్య సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. నెలకు అవసరమయ్యే 10 రకాలైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గర్భిణీలు, బాలింతలకు వారి ఇళ్ల వద్దకే ఈ పౌష్టికాహార కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు ల్. వలంటీర్ల ద్వారా లబ్దిదారులకు వీటిని అందజేస్తుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు గర్భిణులు, బాలింతలకు ఆయా ఆంగన్వాడి కేంద్రాల వద్ద పౌష్టికాహారాన్ని అందజేసేవారన్నారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వార్డు ఇంఛార్జి భ్రాహ్మయ్య, అంగన్వాడీ కార్యకర్తలు శాంత కుమారి, అహమ్మద్ బీ ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.