PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

4వ విడుత వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ

1 min read

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  SV విజయ మనోహరి

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న “వైఎస్సార్ ఆసరా” 4వ విడత సంబరాల్లో భాగంగా నేడు వెలుగోడు మండలం   ఎంపీడీవో ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి మహిళలు భారీ ఎత్తున హారతులతో, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఈ ఆసరా కార్యక్రమానికి వేలదిగా  తరలి వచ్చిన వైఎస్ఆర్ ఆసరా లబ్దిదారులు, మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను 99% శాతం నెరవేర్చారు అని తెలిపారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు ఇవ్వని చేయని విధంగా ఒక్క రూపాయి అవినీతి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల డబ్బులను, రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నేరుగా మన అక్క చెల్లెమ్మ ల లబ్దిదారుల అకౌంట్ లలోనే వేస్తున్నారని తెలిపారు. అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి మాట తూ.చా. తప్పకుండా వదిలేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిలో ఒకటి కూడా వెరవెర్చకుండ మోసగించిన చంద్రబాబు పాలన అంటూ మహిళలకు ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అందుతున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి,  మహిళలు అందరూ ఒక్కసారి తేడాలు గమనించి, మంచి చేశాం అంటేనే ఓటు వేయండి అని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  ఆసరా లబ్ధిదారుల తో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా వెలుగోడు మండలానికి సంబందించిన లబ్ధిదారులకు మంజూరు అయిన (7,26,66,875) అక్షరాల  ఏడు కోట్ల 26 లక్షల 66 వేల 875 రూపాయల చెక్ ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  అందజేశారు…ఈ కార్యక్రమంలో వెలుగోడు మండలం మరియు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,అధికారులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author