ప్రతి అక్క ప్రతి చెల్లికి ఆర్థిక స్వావలంబనే వైయస్సార్ ఆసరా
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: నియోజకవర్గం లో.కోవెలకుంట్ల పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ అవరణం లో వైయస్సార్ ఆసరా పథకం మూడో విడత కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పొదుపు మహిళా సంఘాల సభ్యులకు మెగా చెక్కును అందజేశారు . బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ నాడు 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో మహిళలకు పొదుపు రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తూ.చా తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా దశలవారీగా మహిళా పొదుపు రుణాల ను తీర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే జగనన్న వైయస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు రుణాలను నాలుగు దశలవారీగా పూర్తిగా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటిలో కూడా 98% మేరా నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకోవడం జరిగిందని జగనన్న ప్రవేశపెట్టిన పథకాలలో ఎక్కువ భాగం మహిళలకు మాత్రమే కేటాయించడం దీనికి నిదర్శనం అని చెప్పారు. నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ మళ్లీ ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని మహిళలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, కోవెలకుంట్ల మండల పరిషత్ అధ్యక్షురాలు భీమి రెడ్డి రమాదేవి, కోవెలకుంట్ల పట్టణ ఉప సర్పంచ్ GCR సూర్య నారాయణ రెడ్డి,పట్టణ సర్పంచ్ మెట్ల సరళ, కోవెలకుంట్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ భీమీ రెడ్డి ప్రతాప్ రెడ్డి,మండల వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ దౌలా,వెలుగు అధికారులు,మండల అధికారులు, పొదుపు మహిళా సంఘాల సభ్యురాళ్లు, పొదుపు మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.