వైయస్సార్ యువ నాయకుడు బుట్టా ప్రతుల్ జన్మదిన వేడుకలు
1 min read
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠంల పెద్ద కుమారుడు, యువ నాయకుడు శ్రీ బుట్టా ప్రతుల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మిగనూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి. నజీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, జన్మదిన వేడుకలను జరిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “యువ నాయకుడు బుట్టా ప్రతుల్ తన కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రజాసేవనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఆయన నాయకత్వంలో భవిష్యత్‌లో నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేకూరుతుందని మేము నమ్ముతున్నాం అని అన్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు బుట్టా ప్రతుల్ గ సేవా భావాన్ని, యువతలో ఆయనకు ఉన్న ఆదరణను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.బుట్టా ప్రతుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలు ఉత్సాహంగా, ఉల్లాసంగా నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు మంచుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, వైయస్ఆర్ సిపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డి , జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె. రాజశేఖర్ , చేనేత జిల్లా అధ్యక్షులు ఎం.కె. శివప్రసాద్ ,గడ్డం అంజి, గరువయ్య మభాష, సయ్యద్ ఫయాజ్,వడ్డే వీరేష్, లతరెడ్డి, పామయ్య, నరసింహులు, కడిమెట్ల నాగార్జున రెడ్డి, జగ్గాపురం రాజు, జగ్గాపురం వీరేష్, జగ్గాపురం ఈరన్న నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.