వైసీపీ..అంగన్వాడీ జనరల్ సెక్రటరీ గా జి. సావిత్రమ్మ ఎన్నిక
1 min read
అంగన్వాడీ జనరల్ సెక్రటరీ ఎన్నికైన జి.సావిత్రమ్మకు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నల్లబోతుల సావిత్రమ్మ కి ఘనంగా సన్మానం చేసిన వైయస్ఆర్ సి పి శ్రేణులు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అంగన్వాడీ జనరల్ సెక్రటరీ జి.సావిత్రమ్మకు గమరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా నల్లబోతుల సావిత్రమ్మ ఎన్నికైన సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాలు లతా రెడ్డి, జ్యోతి,సుఫల,మేఘన,స్వాతి,ఈశ్వరమ్మ నాయకులు కార్యకర్తలు తదితరులు ఘనంగా సన్మానించారు.వారు మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక , పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివనీలకంఠ , రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్ సహకారంతో ఈ పదవులు దక్కాయని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.