NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారా లోకేష్ ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు

1 min read

టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి వెల్లడి

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  పైన రెడ్ బుక్,గురించి చేసిన వాక్యాలను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు పాలకుర్తి తిక్క రెడ్డి తప్పు పట్టారు ఈ విషయమే వారు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పత్రికల వారితో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి 152 స్థానాలు ఇచ్చి ప్రజలుఅధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ప్రజాస్వామ్యం అవినీతి, అహింసయిత ,పాలన సాక్షాత్తు అసెంబ్లీలోనే బూతులు మాట్లాడే కొత్త సాంప్రదాయానికి తెర తీశారు ,అన్న విషయాన్ని విస్మరించవద్దని గుర్తు చేశారు ఆనాడు మీరు అమలు చేసిన రాజారెడ్డి రాజ్యాంగంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల పరిస్థితులను స్వయంగా తెలుసుకొని వారికి ధైర్యాన్ని , ఇవ్వాలన్న, ఉద్దేశంతో,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  జనవరి 27, 2023న ఇవగలం పేరుతో రాష్ట్రంలోని యువకులను రైతులను ప్రజానీకానికి భరోసా కల్పించే నిమిత్తం పాదయాత్ర కొనసాగించాలని వైసీపీ పాలనలో కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం వారు ఇష్టం వచ్చినట్లు ప్రజలను చట్టాన్ని ధిక్కరించి ప్రవర్తించారని అలాంటి వారి యొక్క వివరాలను మాత్రమే సేకరించి ప్రజాకంటకులుగా వారిని అధికారుల లిస్టు రికార్డు చేసుకున్నారని అది రెడ్,బుక్ అంటూ మీరు గగ్గోలు చేయాల్సిన అవసరం లేదని రెడ్,బుక్ అంటే మీకెందుకు అంత భయం తప్పు చేసిన అధికారులు ఎప్పటికైనా దోషులుగా నిలుస్తారని గతంలో కూడా వైఎస్ అధికారులు ఉండగా తప్పుడు పనులు చేసిన వారు జైలుకెళ్ళి వచ్చారని జగన్ హయాంలో పనిచేసిన వారు కూడా ఈ రోజు కోర్టుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారని అలాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకొని ముందుకు వెళుతుంది కానీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కచ్చ సాధింపులకు తావు లేదని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఎల్ ఎల్  సి ,పనులకు నిధులు కేటాయించి రైతులకు నిరంతరము,పాటుపడుతున్నారని గత వైసిపి ప్రభుత్వం హయాంలో  ఇరిగేషన్ ,కువాడిన మోటార్లకు సంబంధించిన కనీసం కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేదని అలాంటివారు నేడు విమర్శలు చేయడం భావ్యం కాదని జగన్ పానాలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమైపోయిందిఅని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పోలవరం అమరావతి పునాది,వంటి వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టారని మీరు 3రాజధానులు అంటూ ప్రజలకు రాజధాని లేకుండా చేసారని కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో ఎప్పటికి సామాజిక పించనుల పెంపు, దీపం 2 ,అన్న క్యాంటీన్లు డీఎస్సీ నోటిఫికేషన్ వంటి వాటిని ఆచరణలోకి తీసుకొని త్వరలోనే అమలు చేస్తామని మీప్రభుత్వం లాప్రజలను ఎక్కడ ఇబ్బందులు పాలు చేయలేదని ఇకనైనా వైయస్సార్సీపి నాయకులు లోకేష్ పై అనవసరమైన వాక్యాలు చేయడం మానుకోవాలని వారికి లోగోస్ ని విమర్శించే స్థాయి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం కార్యక్రమంలో పార్టీ నాయకులు పవై నాగేశ్వరావు యాదవ్ ,ముత్యాల తిరుపాలు, పి మనోహర్ చౌదరి, హనుమంతరావు చౌదరి,రాజుయాదవ్, సత్రం రామకృష్ణుడు ,జేమ్స్ ,అఖిల్ ,బజారన్న తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *