కూలిపోయిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన వైకాపా నాయకులు
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు: నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం రాఘవేంద్ర పురం కాలనీ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బుధవారం కూలిపోయిన విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు మల్లికార్జున, వార్డు సభ్యులు వీరారెడ్డి టాంక్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఏఈ వెంకట్రాముడు తో మాట్లాడగా 2017లో నిర్మాణం చేపట్టగా గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండటం ఇటీవల ట్యాంకు కు వాటర్ సప్లయ్ ట్ర్లైరన్ చేయడం వల్ల కూలిపోయిందని ఏఈ వెంకట్రాముడు వివరించారు. ట్యాంక్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.పంచాయతీ కార్యదర్శి ఇష్రాత్ బాష పరిశీలన : ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిపోయిన విషయం తెలుసుకున్న మంత్రాలయం పంచాయతీ కార్యదర్శి ఇష్రాత్ బాష సచివాలయ ఉద్యోగులు తో కలిసి పరిశీలించారు.