PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైఎస్ఆర్సిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు మండలంలో 17వ తేదీ, 19వ తేదీ లలో అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంటలు దెబ్బ తినడంతో, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైయస్ఆర్ సీపీ నాయకులు, అలాగే వ్యవసాయ అధికారులు మండల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది, ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీరల సురేష్ యాదవ్ లు మాట్లాడుతూ, ఈ అకాల వర్షాల కారణంగా మండలంలోని బయనపల్లె ,దౌలతాపురం, గుర్రంపాడు గ్రామాలలో అక్కడక్కడ నూగు పంట నష్టం వాటిల్లిందని తెలియజేశారు, దీనికి సంబంధించి ప్రిలిమినరీ రిపోర్ట్ క్రింద 40 ఎకరాలలో నువ్వుల పంటకు నష్టం జరిగినట్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేయడం ఇవ్వడం జరిగిందని తెలిపారు, అదే విధంగా గుర్రంపాడు, రా చిన్నాయ పల్లెలో వేసినటువంటి 39 ఎకరాల లోని దోస పంట కూడా కొంత వరకు నష్టం జరిగినట్లు గుర్తించడమైనదని వారన్నారు, అన్ని గ్రామాలలో రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లకు రైతు వారిగా వివరాలను తయారు చేయమని సూచించడం జరిగిందని ఈ తుది జాబితాలనుపంట నష్టం జరిగిన పొలాలను అన్నిటిని పరిశీలించి నివేదిక రూపంలో ఉన్నత అధికారులకు పంపడం జరుగుతుందని, తద్వారా అధికారులు ప్రభుత్వానికి నివేదికల సమర్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బాధిత రైతులకు అండగా ఉంటారని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు, అనంతరం మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, మాట్లాడుతూ, ముఖ్యంగా వరి సాగుచేసిన రైతులు వరిలో వచ్చే కాండం తోలుచు పురుగులు, అలాగే ఇతర సిలింద్ర సంబంధిత తెగులు రాకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆమె రైతులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ అడ్వైజర్ మెంబర్ ఎర్ర సాని మోహన్ రెడ్డి , బయనపల్లి సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ , మండల అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డ్ మెంబర్ శ్రీ వెంకటసుబ్బారెడ్డి , వీఏ ఏ చరణ్ కుమార్ రెడ్డి, వీహెచ్ఏ బ్లేస్సి రైతులు పాల్గొన్నారు.

About Author