NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఐని కలిసిన వైఎస్ఆర్సిపి ముస్లిం మైనారిటీ యూత్ సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రామిరెడ్డి గారు బైక్ ప్రమాదం నుంచి చికిత్స పొంది విధుల్లోకి హాజరైనందున కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న బిగ్ టీవీ రిపోర్టర్ మరియు బనగానపల్లె పట్టణ వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ యూత్ సభ్యులు.కొన్ని రోజుల క్రితం విధి నిర్వహణలో బైక్ ఆక్సిడెంట్ లో ఎస్ఐ రామిరెడ్డి ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొంది కోలుకున్న ఎస్ఐ రామిరెడ్డి గారు మళ్ళీ విధుల్లోకి హాజరయ్యారు. ఎస్ఐ గారి ఆరోగ్యం కుదుటపడి విధుల్లోకి హాజరు కావడం సంతోషించవలసిన విషయమని రిపోర్టర్ సయ్యద్ హుస్సేన్ తేలియజేశారు. పట్టణంలోని వైఎస్ఆర్సిపి ముస్లిం మైనారిటీ యూత్ సభ్యులు ఎస్ఐ గారిని శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో రిపోర్టర్ సయ్యద్ హుస్సేన్, పట్టణ వైయస్సార్ పార్టీ ముస్లిం మైనారిటీ యూత్ కరీం, సికిందర్, బబ్లు ఆసిఫ్,గౌస్, హుస్సేన్, సోహెబ్, నాగూర్,బాషులు,తదితరులు పాల్గొన్నారు.

About Author