పొగాకు రైతులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సిపి..!!!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఓర్వకల్లు ఐటిసి మరియు జి పి కంపెనీ వద్ద పొగాకు రైతులను కలిసిన వైఎస్సార్ సిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి…!!ఈరోజు ఓర్వకల్లు మండలంలోని ; ఓర్వకల్లు లో ఉన్న ఐటీసీ మరియు జీ పి కంపెనీ గోడౌన్ ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓర్వకళ్లు పొగాకు జి పి కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు.. రైతుల వద్ద పొగాకును కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడేమో కొనుగోలు చెయ్యడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పొగాకును క్వింటా 15 వేలకు కొంటామని ముందుగానే రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు 7 వేలకు తీసుకుంటామని పొగాకు కొనుగోలు దారులు చెప్పడం పై ఆందోళన చెందుతున్న రైతులు..గతంలో మంచి ధర పలికిన పొగాకు ,ఇప్పుడు ధర లేక పోవడంతో విలవిలాడుతున్న రైతన్నలు. పొగాకు మద్దత్తు ధర కల్పించాలని చెయ్యాలని డిమాండ్ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి రైతుల పొగాకును కొనుగోలు చేసేదాకా రైతులకు అండగా ఉంటామని లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఓర్వకల్లుమండల వైయస్సార్సీపి నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.