అక్రమ మైనింగ్ కు బీజం వేసింది వైఎస్సే
1 min readపల్లెవెలుగు వెబ్: కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కు బీజం వేసింది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డే అని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. తండ్రి బీజం వేస్తే కొడుకు అధికారంలోకి వచ్చాక పెంచి పెద్దది చేశారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో రెవెన్యూ రికార్డులు టాంపర్ చేసి లేని సర్వే నెంబర్ 143ను సృష్టించారని, ఆ సర్వే నెంబర్ కింద అక్రమ మైనింగ్ కోసం 216 ఎకరాలు కేటాయించారని ఆరోపించారు. సర్వే నెంబర్ 143 ఇంకు పెన్నుతో రాసి సృష్టించిందేనని డిసెంబర్ 27, 2016లో హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పుకు లోబడి 2017లో అప్పటి సీఎం చంద్రబాబు లీజులన్నీ రద్దు చేశారని గుర్తు చేశారు. జగన్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారని పట్టాభిరామ్ విమర్శించారు.