వైఎస్ రాజకీయ వారసుడు జగన్ కాదు : డిప్యూటీ సీఎం
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కష్టపడి పాదయాత్ర చేశారని, గ్రామాల్లో తిరిగి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకుని స్వతహాగా ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు కాదని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ప్రతిపక్షనేతగా ఇదే చివరి అవకాశమని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు కోటి పరిహారం ఇస్తామంటున్న చంద్రబాబు.. పుష్కారాల్లో చనిపోయిన వారికి ఎన్ని కోట్లు ఇచ్చారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజ పురంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.