యుగ పురుషుడు ఎన్టీఆర్..!
1 min read– తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్..
– రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘన విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలి..
– నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలు దిక్కులా చాటిన మహోన్నతమైన వ్యక్తి, నట యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంఛార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలోని అల్వాల సత్రంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళుల్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. మహానాయుకుడు అగుడుజాడల్లో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని మాండ్ర శివానంద రెడ్డి చెప్పారు. మహానాయుకుడు ఎన్టీఆర్ అగుడుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బడుగు , బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారాక రామారావు అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక అని కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల కోసం టీడీపీ నిరంతరం పని చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ కథానాయకునిగా, మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్ధం, నిర్భీతి..ఇవే ఎన్టీఆర్ ఆయుధాలనన్నారు. అందుకే ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకుని వ్యవస్థలను సంస్కరించగలిగారు. తెలుగుజాతి ముద్దుబిడ్డడు కాగలిగారని పేర్కొన్నారు. తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన మహానుబావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని కొనియాడారు. ప్రజా సంక్షేమ పాలనకు పెట్టింది పేరు ఎన్టీఆర్ అని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని బీజం వేసిన నేత అని అన్నారు తెలగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తందాన శిబిరానికి విశేష స్పందన లభించింది అన్నారు.అంతకుముందు అల్లూరు గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, మద్దూర్ తిమ్మారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గిత్త జయసూర్య, పార్టీ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, కౌన్సిలర్ గుంజపల్లె భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ముర్తుజావలి, పాములపాడు , మిడుతూర్ టిడిపి మండల కన్వీనర్ హరినాథ్ రెడ్డి, ఖాతా రమేష్ రెడ్డి, నందికొట్కూరు టిడిపి మండల కన్వీనర్ తోకల ఓబుల్ రెడ్డి, టిడిపి నాయకులు వంగాల శివరామిరెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షుడు లాయర్ జాకీర్, వేణు తదితరులు పాల్గొన్నారు.