NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువగళం  నవశకం విజయవంతం

1 min read

టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పొలిపల్లి గ్రామంలో 20న జరిగిన జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన యువగళం – నవశకం కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన సందర్బంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం అల్లూరు గ్రామంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పదని, ఎన్నికలలో దాదాపు 160 స్థానాలలో  విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో నాయకులు ప్రసాద రెడ్డి, రమేష్ రెడ్డి, గిరీశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, జనార్దన్, జమీల్, సర్పంచ్ నాగలక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, లాడెన్, బాబు, బాబుసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

About Author