NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఆంధ్ర రత్న భవనం నందు రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టి సందీప్ ఈశ్వర్ యువజన కాంగ్రెస్ జెండాను ఎగరేశారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి బి రామ్ సింగ్ యువజన కాంగ్రెస్ సభ్యులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసఫ్  కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా జోసఫ్ మాట్లాడుతూ ఈ దేశంలో యువజన కాంగ్రెస్ నుండి అనేకమంది దేశ గొప్ప నాయకులుగా అవతరించారని యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య భూమిక పాత్ర పోషించే వ్యవస్థ లాగా తయారయ్యిందని ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థగా అవతరించినది అని యువజన కాంగ్రెస్లో సభ్యులైనందుకు మేమందరం గర్వపడుతున్నామని  పేర్కొన్నారు ఇలాగే దేశంలోని రాష్ట్రంలోని యువకులు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజిని ఫాలో అయ్యి దేశాన్ని ఒక ఉన్నత శిఖరానికి చేసే ప్రయోగంలో పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ నందిగామ నియోజకవర్గ అధ్యక్షులు ఆరిఫ్. విజయవాడ యువజన కాంగ్రెస్ సభ్యులు రహీం  జాన్. శివ. పృథ్వి . ప్రదీప్. మరియు విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు . గురునాథం. శివాజీ. మురళి. అన్సారి . కొమ్మినేని సురేష్.  మరియు అనేకమంది నాయకులు పాల్గొన్నారు.

About Author