NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీటీడీ చైర్మన్ గా మ‌ళ్లీ వైవి సుబ్బారెడ్డే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మన్ గా మ‌రోసారి వైసీపీ సీనియ‌ర్ నేత వైవి సుబ్బారెడ్డి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత మొద‌టిసారి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియ‌మించింది. రెండోసారి కూడ ఆయ‌న‌నే ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. కొత్త వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియ‌మిస్తార‌ని ఊహాగానాలు తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పటికీ.. మ‌ళ్లీ వైవీ సుబ్బారెడ్డి వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. త్వర‌లో టీటీడీ బోర్డు స‌భ్యుల‌ను కూడ నియ‌మిస్తారు. వైవీ సుబ్బారెడ్డి గ‌తంలో ఒంగోలు ఎంపీగా ప‌ని చేశారు. వైవీ సుబ్బారెడ్డి సీఎం జ‌గ‌న్ కు బాబాయి అవుతారు.

About Author