పోలీస్ స్టేషన్ కు ‘జబర్దస్త్’ వినోద్
1 min readహైదరాబాద్: జబర్దస్త్ నటుడు వినోద్ అలియాస్ వినోదిని పోలీసులను ఆశ్రయించాడు. ఒక ఇంటికి సంబంధించిన వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసారు. వినోద్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కొనేందుకు.. 40 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. 13 లక్షల నలబై వేలు అడ్వాన్స్ చెల్లించినట్టు వినోద్ చెబుతున్నాడు. అయితే.. ఆ ఇంటి యజమాని 40 లక్షల కంటే ఎక్కువ ధర చెల్లిస్తేనే.. ఇంటిని అమ్ముతానని చెప్పాడని, లేకుంటే అడ్వాన్స్ కూడ చెల్లించనని బెదిరిస్తున్నాడని వినోద్ ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయంలో గొడవ జరిగింది. వినోద్ మీద భౌతిక దాడి చేశారని అప్పట్లో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసుల నుంచి న్యాయం జరగకపోవడంతో డీసీపీ రమేష్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించినట్టు సమాచారం.