PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు 18వ వార్షికోత్సవ వేడుక ‘జీ మహోత్సవం

1 min read

– ఆదివారం సాయంత్రం 6 గంటలకు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సరికొత్త  సీరియల్స్, భిన్నమైన కాన్సెప్ట్తో రియాల్టీ షోలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2005లో ప్రారంభమైన జీ తెలుగు వినోదం, విజ్ఞానం పంచుతూ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. ఈ విజయ పథంలో మరో మైలురాయి దాటిన సందర్భంగా 18 వసంతాల వేడుకను ఘనంగా జరుపుకుంటోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల, యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జీ తెలుగు 18వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం, జీ తెలుగు మహోత్సవం మే 21న సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.గత 18 సంవత్సరాలుగా జీ తెలుగు ఛానల్ని ఆదరించిన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వార్షికోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. సరికొత్త కార్యక్రమాలు, సీరియల్స్లో ప్రేక్షకులకు వినోదం పంచడంతోపాటు డాన్సింగ్, సింగింగ్ షోలతో మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమాలతో టెలివిజన్ చరిత్రలో సరికొత్త ఒరవడి సృష్టించింది జీ తెలుగు. తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు వారి అభిమానానికి గుర్తుగా జీ మహోత్సవం వేడుకను అంతులేని వినోదంతో అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఎవర్ గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయిస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాదు, మైమరపించే పాటలు, మెప్పించే ఆటలతో వీక్షకులకు పూర్తి వినోదాత్మక సాయంత్రాన్ని అందించేందుకు మీ జీ తెలుగు మరోసారి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి మీ అభిమాన జీ తెలుగు నటీనటులతోపాటు ఆది, లావణ్య త్రిపాఠి, బిత్తిరి సత్తి వంటి సినీ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు.

ఈ 18 సంవత్సరాల మహోన్నత ప్రయాణంలో జీ తెలుగు విజయంలో భాగమైన కళాకారులు, టెక్నీషియన్లు మహోత్సవం వేడుకపై తమ అనుభవాలను పంచుకుంటారు. తమ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించే సరిగమప సింగర్స్ చక్కని పాటలతో ప్రేక్షకులను మెప్పిస్తారు. రీల్ జోడీల ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆటలు, పాటలు, అల్లరి, జోకులు, అనుభవాలు, భావోద్వేగాల మిళితమైన చక్కని సాయంత్రాన్ని మహోత్సవం వేడుక కానుకగా ప్రేక్షకులకు అందిస్తోంది జీ తెలుగు.జీ తెలుగు విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జి మహోత్సవం వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించడంలో జీ తెలుగు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 18 సంవత్సరాలుగా తన వీక్షకుల కోసం అద్భుతమైన, వినూత్నమైన కార్యక్రమాలను అందిస్తున్న జీ తెలుగు ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ పొంది విజయవంతంగా కొనసాగుతోంది. విజయవంతంగా 18 వసంతాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జీ తెలుగుపై ప్రేక్షకులను మెప్పించే బాధ్యత మరింత పెరిగింది. ఈ బాధ్యతని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ అద్భుతమైన వినోదం పంచుతూ ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలను పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది జీ తెలుగు. జీ తెలుగు 18 వసంతాల పండగ జీ మహోత్సవం ఈ ఆదివారం, సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.

About Author