జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూల్: రోజురోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ‘ జీ తెలుగు ‘ ఈ జర్నీలో తమతో పాటు నడిచిన నటులని , డైరెక్టర్లని , రచయితలని , ప్రొడ్యూసర్లని , ఇతర జీ కుటుంబ సభ్యులని ప్రోత్సయించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది . ‘ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ‘ ద్వారా ప్రతి సంవత్సరం అద్భుతమైన ప్రజాదరణ కనబరిచిన జీ కుటుంబ సభ్యులని గౌరవిస్తూ వస్తుంది . ఐతే , ఈసారి కుటుంబం అవార్డ్స్ మునుపెన్నడూ లేనంత గ్రాండ్ గా కాస్త ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచుతూ నిర్వహింపబడింది . వందలాదిగా సినీ మరియు టీవీ ప్రముఖులు తరలివచ్చిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో మీ అభిమాన నటులు అవార్డులు గెలుచుకున్నారో లేదో తెలియాలంటే అక్టోబర్ 16 న ( ఆదివారం ) సాయంత్రం 5:30 గంటల వరకు వేచిఉండాల్సిందే ! శ్రీముఖి , సుధీర్ మరియు ప్రదీప్ యాంకర్లుగా వ్యవహరించిన ఈ ఈవెంట్ ఉత్తమ కథానాయకుడు , ఉత్తమ భార్య , ఉత్తమ కుటుంబం , ఉత్తమ భర్త వంటి మరెన్నో కేటగిరీల్లో అవార్డ్స్ ను అందజేయనుంది . హీరోయిన్లు అంజలి , లక్ష్మి రాయ్ , జీ అత్తాకోడళ్లు , మరియు సీరియల్ హీరోహీరోయిన్లు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనలు , జీ సరిగమప గాయకుల మైమరిపించే పెర్ఫార్మన్స్ , మరియు డాన్స్ ఇండియా ఇండియా తెలుగు కంటెస్టెంట్స్ యొక్క ఎనర్జిటిక్ స్టెప్స్ ఆకట్టుకోనున్నాయి . అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు నటీనటులు చేసిన భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు . జీ తెలుగు కుటుంబ సభ్యులతో పాటు , నటులు అంజలి , లక్ష్మి రాయ్ , నవీన్ చంద్ర , కలర్స్ స్వాతి , బాబు మోహన్ , సాయి కుమార్ , సోహెల్ , తేజ సజ్జ , శ్రీనివాస్ రెడ్డి , నిహారిక కొణిదెల , ఎస్తర్ , శివ బాలాజీ , మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే , దర్శకులు బోయపాటి శ్రీను , మారుతీ , తేజ , మరియు మల్లిడి వసిష్ఠ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు .