PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ..ఈ ఆదివారాల్లో మీ జీతెలుగులో!  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రారంభించినరోజునుంచీప్రతిభావంతులైన కళాకారులు, దర్శకులు, రచయితలు,నిర్మాతలు, చిత్రబృందం అచంచలమైన అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో జీతెలుగు తిరుగులేని ఎదుగుదల కొనసాగుతోంది. ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబఅవార్డులను ప్రదానం చేయడం ద్వారా అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులనుప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా వైభవంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈసంవత్సరం మరింత ఘనంగా జరిగింది.జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2‌023 వెండితెర,బుల్లితెర తారల తళుకులుతోఅత్యంత వైభవంగా సాగిన కుటుంబంఅవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్ 29సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీఅభిమాన నటులు ఏఅవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మిస్ అవకుండా చూడాల్సిందే. అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్స్రవి-శ్యామల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈకార్యక్రమంలోపుట్టింటివెలుగు, ఆత్మీయపురస్కారం, జీతెలుగుచిచ్చరపిడుగు, రొమాంటిక్కపుల్, బెస్ట్కెమిస్ట్రీ, ఉత్తమకోడుకు, జీనారీశక్తి, జీతెలుగువెలుగు, ఉత్తమటైటిల్సాంగ్తదితరవిభాగాల్లో అవార్డులనుప్రదానంచేయనున్నారు.అవార్డు విజేతలు, విజేతలకు అవార్డులు అందజేయడానికి విచ్చేసిన ప్రముఖులతోకార్యక్రమం వైభవంగా జరిగింది.ప్రఖ్యాత తారల యొక్క మంత్రముగ్ధులయ్యే నృత్య ప్రదర్శనలుప్రేక్షకులనుకచ్చితంగా అలరిస్తాయి. ఈ కార్యక్రమంలో జీ తెలుగు కుటుంబ సభ్యులతో పాటు నేచురల్స్టార్ నాని,రామ్ గోపాల్ వర్మ,సంయుక్తా మీనన్,రేణు దేశాయ్,అనిల్ రావిపూడి,తరుణ్ భాస్కర్,అనంత్ శ్రీరామ్,సుమ-రాజీవ్ కనకాల,రఘు బాబు,పాయల్ రాజ్పుత్,కావ్య కల్యాణ్ రామ్,అనసూయ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఘనంగా జరిగిన వేడుకల్లో,టెలివిజన్సూపర్స్టార్ నిరుపమ్ పరిటాల అదిరిపోయే గిప్ట్ అందుకున్నారు. ఇక,హృదయాలను హత్తుకునేఈప్రదర్శనలతో ఈ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగాజరిగింది.

About Author