రిలయన్స్ అధినేతను అధిగమించిన `జావో` !
1 min readపల్లెవెలుగువెబ్ : క‌్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీ బినాన్స్ అధినేత చాంగ్ పెంగ్ జావో ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో చేరారు. జావో ప్రపంచ కుబేరుల్లోని 11 వ స్థానాన్ని పొందినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ తెలిపింది. జావో.. చైనా మూలాలు ఉన్న కెనడా జాతీయుడు. జావో సంపద అక్షరాల దాదాపు 7.2 లక్షల కోట్లుగా బ్లూమ్ బర్గ్ లెక్కకట్టింది. ఒరాకిల్ సంస్థ లారి ఎలిసన్, రిలయన్స్ ముఖేశ్ అంబాని మధ్య స్థానాన్ని జావో సంపాదించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన క్రిప్టో బిలీనియర్లలో కూడ జావోనే అగ్రగణ్యుడు. బినాన్స్ లో వాటా ఆధారంగా బ్లూమ్ బర్గ్ జావో సంపదను లెక్కకట్టింది. బ్లూమ్ బర్గ్ లెక్కల కంటే ఇంకా ఎక్కువే జావో సంపద ఉన్నట్టు తెలుస్తోంది.