NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ల‌వ‌ర‌పెడుతున్న జికా వైర‌స్.. 66కు పెరిగిన సంఖ్య !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఉత్తర‌ప్రదేశ్ లో జికా వైర‌స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. కాన్పూర్ లో జికా వైర‌స్ కేసుల సంఖ్య 66కు చేరింది. వీరిలో 45 మంది పురుషులు కాగా.. 21 మంది మ‌హిళ‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాయుసేన‌లో ప‌నిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధ‌ప‌డుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయ‌న రక్త శాంపిల్స్ ను ల్యాబ్ కు పంప‌గా జికా వైర‌స్ గుర్తించారు. దీంతో అప్రమ‌త్తమైన అధికారులు ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే వారి కాంటాక్ట్ ట్రేసింగ్ మొద‌లుపెట్టారు. వీరిలో ఇప్పటివ‌ర‌కు 66 మందికి జికా వైర‌స్ సోకిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్రజ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నివార‌ణ చ‌ర్యలు తీసుకుంటోంది.

About Author