NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ చైర్మన్​ జన్మదినం… రక్తదాన శిబిరం ఏర్పాటు

1 min read

– రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పినిపే విశ్వరూప్

– శిబిరంలో 21 మంది రక్తదానం..

 పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీప్రసాద్  పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 21 మంది ప్రజలు రక్తదానం చేశారని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి  పినిపే విశ్వరూప్ మరియు దెందులూరు ఎమ్మెల్యే  కొఠారు అబ్బయ్య చౌదరి హాజరయ్యి మెడికల్ క్యాంపును మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఘంటా ప్రసాదరావు, డాక్టర్ ఆర్ఎస్ఆర్కె వరప్రసాదరావు, పిఆర్ఓ కె వి రమణ రెడ్ క్రాస్ సిబ్బంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author