చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్
1 min read
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం చూడాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భీమడోలు మండలంలో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ బుధవారం పర్యటించారు. ఈమేరకు తొలుత గుండుగొలను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారిణి అనురాధాతో కలిసి సందర్శించి కేంద్రం పనితీరును పరిశీలించారు.తడి చెత్త, పొడి చెత్త సేకరణ సంబంధించిన వివరాలను జడ్పీ చైర్ పర్సన్ పద్మశ్రీ వర్మీకంపోస్ట్ ఎరువు తయారీవిధానం, కేంద్రంలోని యంత్రాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆగడాలంక, మల్లవరం, చెట్టున్నపాడు గ్రామాల్లోని మంచినీటి చెరువులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చైర్ పర్సన్ పరిశీలించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రానున్న వేసవిలో గ్రామాల్లో త్రాగునీరు ఇబ్బందిని కలుగకుండా జిల్లా యంత్రాంగం చూడాలని, అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు పలు అంశాలను చైర్ పర్సన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతిదేవి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.