22 న జిల్లా పరిషత్ ఆవరణలో ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘము. ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల కురువ కులస్తులందరి పదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ నెల 22వ తేది ఇవ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి తేలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు పాల్గొంటారని ఆయన చేతుల మీదుగా జ్ఞాపిక, సర్టిఫికెట్లు,నగదు బహుమతిని అందజేస్తామని కమిటీ సభ్యులు తేలిపారు. ఈ సమావేశం కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలోని మండల ప్రజాపరిషత్ సమావేశభవనం లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22 వ తేదీన ఉదయం 10 గంటలకు విద్యార్థిని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.