ఫైనాన్స్ రంగంలోకి జొమాటో !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్‌క్రెడ్‌తో జొమాటో 2020 లోనే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలను అందజేస్తుంది. ప్రస్తుతం జొమాటో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే రుణాలను అందజేసే అవకాశం ఉంది. రూ.10 కోట్లతో ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. ఇది పూర్తిగా జొమాటో అనుబంధ సంస్థగా ఉండనుంది. కాగా సబ్సీడరీ కంపెనీకి ఏ పేరు పెట్టాలనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని సమాచారం.ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది.