నష్టాలను తగ్గించుకున్న జొమాటో.. ఎలాగంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ స్వీకరణ సంస్థ జొమాటో డిసెంబర్ త్రైమాసికంలో గణనీయంగా నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 352 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం ఉండగా.. తాజాగా అది రూ. 67 కోట్లకు పరిమితమైంది. ఫిట్సో అనే కంపెనీలో తనకున్న వాటాలను జొమాటో విక్రయించింది. తద్వార రూ. 316 కోట్లు సమకూరాయి. ఇది మినహాయించి చూస్తే నష్టం రూ. 383 కోట్లు కార్యకలాపాలపై వచ్చినట్టు తెలుస్తోంది. ఆదాయం సైతం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.609 కోట్ల నుంచి రూ.1,112 కోట్లకు ఎగసింది. వ్యయాలు కూడా రూ.755 కోట్ల నుంచి రూ.1,642 కోట్లకు చేరాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో వచ్చే రెండేళ్లలో రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు జొమాటో ప్రకటించింది.