NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఆహా’ లో జాంబి రెడ్డి రిలీజ్

1 min read

జాంబిరెడ్డి సినిమా ఓటీటీ ఫ్లాట్ పార్మ్ లో విడుద‌లకాబోతోంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈనెల 26న జాంబిరెడ్డి సినిమాని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అయిన ‘ ఆహా ’ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు ప్రశాంత్ వ‌ర్మ మాట్లాడుతూ ‘ జాంబిరెడ్డి ’ సినిమా క‌రోనా త‌ర్వాత ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింద‌ని.. అయితే క‌రోన భ‌యం నేప‌థ్యంలో ప్రజ‌లు పూర్తీ స్థాయిలో సినిమాని థియేట‌ర్లలో చూడ‌లేద‌ని అన్నారు. అందుకోసం సినిమాని ప్రేక్షకుల ద‌గ్గర‌కు తీసుకొచ్చేందుకు ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. గెట‌ప్ శీను క‌సి రెడ్డి పాత్ర పోషించారు. ఈ పాత్ర ఆద్యంతం వినోదాన్ని పండిస్తుంద‌ని ద‌ర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో హీరోగా తేజ స‌జ్జ న‌టించారు.

About Author