NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూమ్ స్కూటీ నూతన ఆవిష్కరణ..

1 min read

– వ్యాపార రంగంలో మరింత రాణించాలి..డిఎస్పి పైడేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సాయి స్వర్ణ హీరో కంపెనీ వారి (110 సి.సి జూమ్ స్కూటీ) నూతన ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు నగర ప్రముఖ వ్యాపారవేత్తల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. వెహికల్ లో నూతన టెక్నాలజీతోఎల్ఈడి లైట్లుతో, డిస్ప్లే పై బ్లూటూత్ అనుసంధానమై ఆవిష్కరించబడిందని యువతీ యువకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు, వ్యాపార రంగంలో మరింత రాణించాలని ముఖ్యఅతిథి గా విచ్చేసిన డీఎస్సీ పైరేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు , వాహనదారులు హెల్మెట్ల ధరించి సురక్షితంగా వాహనాలు నడపాలని సిఐ ఆది ప్రసాద్ సూచించారు , కాలేజ్ మరియు టీనేజ్ కి ఇష్టమైన రంగుల్లో వాహనాలు ఉన్నాయని, అందరికీ అందుబాటు ధరలో లభిస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జీవీఎస్ పైడే శ్వర రావు, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆది ప్రసాద్ ,టూ టౌన్ సీఐ చంద్రశేఖర్, త్రీ టౌన్ సిఐ వరప్రసాద్ పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కోడి కృష్ణంరాజు (రాజా) ప్రధమ ,ద్వితీయ ,తృతీయ కొనుగోలుదారులకు వాహన తాళం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author