ఆధార్ సెంటర్ ను తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు : జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆధార్ అప్డేట్ సెంటర్ ను జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి పరిశీలించారు, గతంలో సచివాలయం-1 ఆధార్ అప్డేట్ సెంటర్ ఉన్నప్పటికీ, అందరికీ అందుబాటులో ఉండే విధంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను ను పరిశీలించారు, ఇందుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు, ఆధార్ కు సంబంధించి మార్పులు చేర్పులు వంటి వాటిని సరి చేసేందుకు ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ఇందులో విద్యార్థులతోపాటు మిగతా వారికి కూడా వారం పది రోజుల పాటు ఇక్కడ ఆధార్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు, అనంతరం మధ్యాహ్న భోజనానికి పరిశీలించిన ఆయన, అక్కడి విద్యార్థులతో, ప్రజా ప్రతినిధులతో ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం మెనూ బాగుందని, వంటలు కూడా బాగా చేశారని ప్రశంసించారు, అలాగే స్థానిక ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది, ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాల పనితీరును గురించి ఎంపీడీవో జాన్ వెస్లీ నీ, అలాగే ఈ పిఓపిఆర్డి సురేష్ బాబును ,అడిగి తెలుసుకున్నారు, తడి చెత్త- పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, తద్వారా రైతులకు మంచి ఎరువులు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి, హెడ్మాస్టర్ పద్మనాభ0, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.