వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్
1 min read– విపత్తుల సమయాల్లో ఆపదమిత్ర దోహదపడుతుంది..
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : విపత్తుల సమయాల్లో అండగా నిలిచేందుకు ఆపదమిత్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ అన్నారు.స్ధానిక జె.వి.ఆర్. నగర్ లోని సోషల్ సర్వీస్ సెంటర్ లో జిల్లా పంచాయితీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆపదమిత్ర వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ విపత్తుపీడిత జిల్లాలో కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. ఇందులోమన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకూడా ఉందన్నారు.విపత్తుల సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు,చర్యలపై 12 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. తొలివిడతగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఎంపిక చేసిన 250 మందికి 12 రోజులు పాటు సమగ్ర శిక్షణ అందించడం జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 100 మందికి 12 రోజులు పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.విపత్తులు సంభవించిన సమయంలో తక్షణం స్పందించేలా ముఖ్యంగా తుఫాను, వరద ప్రభావిత మండలాలు, గ్రామాల్లో ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ఆపదమిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ కె.రవికుమార్,డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిటిఎం జి.ప్రసంగి రాజు,డిపిఎం.రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.