PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం

1 min read

– సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ , పలువురు ప్రజా ప్రతినిధులు
– జిల్లా ప్రజాపరిషత్ యాజమాన్యంలోని సిబ్బంది కుటుంబ సంక్షేమానికి రూ. 15 లక్షలు వార్షిక భీమా చెల్లింపుకు నిర్ణయం.

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యంలో వివిధ హదాల్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సంక్షేమం నిమిత్తం అకాల మరణం చెందిన ఉద్యోగి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ కింద ఆర్ధిక సహాయం అందించాలని సమావేశం తీర్మానించిందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ చెప్పారు. స్ధానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ , శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, షేక్ సాబ్జి, చింతలపూడి శాసన సభ్యులు వి.ఆర్ ఎలీజా, గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, పలువురు జెడ్పి టిసిలు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో త్రాగునీరు, గృహనిర్మాణం, ఉపాధిహామీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల మరణం చెందిన జిల్లా పరిషత్ యాజమాన్యంకు సంబంధించి ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకొనేందుకు జెడ్పి సాధారణ నిధుల నుండి వార్షికంగా రూ. 15 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించేందుకు సమావేశం ఆమోదించిందన్నారు. జెడ్పి కార్యాలయం నుండి గ్రామ పంచాయితీ పింఛను దారులు 230 మందికి, జెడ్పి పింఛను దారులు 26 మందికి వెరసి మొత్తం 256 మందికి పింఛను చెల్లించడం జరుగుతున్నదన్నారు. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేసే ఉద్దేశ్యంతో పింఛను దారుల శ్రేయస్సు కోరి 2023-24 ఆర్ధిక సంవత్సరం నుండి పింఛను చెల్లింపునిమిత్తం రూ. 6 కోట్లు బడ్జెట్ జెడ్పి సాధారణ నిధుల కేటాయించుటకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బడ్జెట్ పెంచినందున పింఛను దారులకు పిఆర్ సి 2015, 2022 అమలు చేసే పింఛను చెల్లించుటకు నిర్ణయించడమైనదన్నారు. నిధుల లభ్యత లేనందున పింఛను దారులకు పిఆర్సీ 2015, 2022 అమలు నెలవారీ పింఛను చెల్లించుటకు మాత్రమే అమలు చేయబడిందన్నారు. చెల్లించవలసిన ఎరియర్ సొమ్ము ప్రభుత్వం నుండి విడుదల అయినచో పింఛనుదారులకు సొమ్ము చెల్లించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ మినీస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లాస్ధాయి భవనం జెడ్పి ఆవరణలో గత 40 సంవత్సరాల నుండి వారి ఆధీనంలో క్యాంటీన్ నిర్వహించుకున్న స్ధలంలో సంఘ సభ్యులు సొంతనిధులతో భవనం నిర్మించుకొనియున్నారన్నారు. సంఘం సంక్షేమ కార్యక్రమాలు, భవనం నిర్వహణ, తదితర ఖర్చులకోసం సదరు భవనం గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకు ఇచ్చుకొనుటకు అనుమతిస్తూ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించడమైనదన్నారు. తాను జెడ్పి చైర్మన్ గా ఉన్న సమయంలో అన్ని విధాలా ఆదరించి ముందుకు నడిపించిన ప్రజా ప్రతినిధులు, జెడ్పిటిసిలు, యంపిపిలు, సర్పంచ్ లు, జిల్లా అధికారులకు జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ జిల్లాలో చేయనివిధంగా ప్రతి జెడ్పిటిసి పరిధిలో అభివృద్ధి పనులకు కోటి రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు తదితర పనుల నాణ్యతను పరిశీలించేందుకు జెడ్పిటిసి, యంపిపి , తహశీల్దారు, యంపిడిఓలతో కూడిన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించేందుకు పాఠశాలలను సందర్శించాలని, అంగన్వాడీలను పరిశీలించాలని సూచించారు. ఈ విధంగా అందరు కలిసికట్టుగా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తే పనుల్లో మంచి ప్రగతి కనబడటమే కాకుండా క్షేత్రస్ధాయిలో సిబ్బందిలో కొద్దిగా బయం ఉంటుందని చెప్పారు. కనీసం నెలకు 2 మార్లు అయినా ఈ బృందం ఆయా మండలాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి ప్రజా సమస్యలు పరిష్కారం బాగా జరుగుతున్నదన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్న సందర్బంలో స్పందనలో పరిష్కారతీరులో అసంతృప్తి ఉంటే తెలియజేయవచ్చని దాని పరిశీలన పిమ్మట సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. స్పందనలో ఎక్కువగా 25 శాతం భూ సమస్యలకు సంబంధించి వస్తున్నాయని అందులో ఎక్కువగా కుటుంబ తగాదాలకు సంబంధించి ఉంటున్నాయన్నారు. ఇటువంటి సమస్యలను స్ధానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దల ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. రబీధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. ఎకరాకు 92 గోనేసంచులు అందించడం జరుగుతుందని అన్నారు. ఇది పంటకోత ప్రయోగాల ద్వారా దిగుబడి అంచనావేసి నిర్ణయించడం జరుగుతుందన్నారు. అయితే 100 సంచులు ఇవ్వాలని డిమాండ్ ఉందని అయితే రైతులు తమ చేతిలో ఉన్నపంటను ముందుగా ఇచ్చేలా అవగాహన పరచాలన్నారు. గోనెసంచుల సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రవాణా సౌకర్యానికి సంబంధించి స్ధానిక ప్రజ ప్రతినిధుల సహకారం కూడా అందివ్వాలని తద్వారా రబీధాన్యం సేకరణ సజావుగా పూర్తిచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. గత ఖరీఫ్ లో 21 రోజులకే సొమ్ము రైతుల ఖాతాలకు జమచేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలో కనీసం 4,5 చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని యంపిడిఓలు, తహశీల్దార్లకు సూచించామని ఆమేరకు వారు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే ఈ విషయంలో స్ధానిక యంపిపి, జెడ్పిటిసిలు కూడా తమ స్ధాయిలో చలివేంద్రాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ కింద పలు ప్రభుత్వ ప్రాధాన్యత నిర్మాణాలు చేపట్టడం జరిగిందని కొన్నిచొట్ల ప్రగతి చాల బాగుందన్నారు. అయితే కొన్ని భవనాలు 95 శాతం నిర్మాణ పనులు పూర్తిచేసుకొని తుదిదశలో ఆగిఉన్నాయని వాటి పనులు సంపూర్ణంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్ధానిక ప్రజాప్రతినిధుల చొరవ ఎంతైనా అవసరమన్నారు. జిల్లాలో రీసర్వే చాలా ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. ఈ విధానం జరుగుతున్నపుడు రైతులకు అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్ధాయి వరకు బాగా పాల్గొంటున్నారని మిగిలిన స్ధానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొని రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందువల్ల రికార్డు, భూమిమీది వివరాలకు వ్యత్యాసాలు ఉంటే గ్రామ సభలో తెలియపరచవచ్చని,రికార్డులో పేరుతప్పుపడినా 21 రోజుల్లో వారికున్న అభ్యంతరాలు తెలియపర్చుకునే అవకాశం ఉందన్నారు. గృహనిర్మాణ సంబంధించి జిల్లాలో ప్రగతి బాగానే ఉందన్నారు. ప్రతిశనివారం హౌసింగ్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న రెండు రోజులు ఇళ్ల నిర్మాణాలకు మంచి సీజన్ కనుక లబ్దిదారులు తమ ఇళ్లు నిర్మించుకునేలా అధికారులతో కలిసి స్ధానిక ప్రజా ప్రతినిధులు లబ్దిదారులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఇప్పటికే స్ధానిక ప్రజా ప్రతినిధుల సహకారం బాగా ఉన్న చోట మంచి ప్రగతి కనబడుతున్నదన్నారు. ప్రస్తుతం ఇళ్లకాలనీల్లో అవసరమైన నీటిసరఫరా, విధ్యుత్ సరఫరా పనులు జరుగుతున్నాయన్నారు. సిసి డ్రైన్లు,రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు, పనులను ఇళ్లనిర్మాణ అనంతరం వేగంగా చేపట్టడం జరుగుతుందన్నారు. ఇళ్ల స్ధలాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలతో భూసేకరణ చేసి రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్ధలాలను అందించిందన్నారు. కొన్నిచోట్ల కోర్టుకేసులు ఉన్న నేపద్యంలో ముందుకు వెళ్లలేకపోడవడం జరిగిందని అయితే వాటికి ప్రత్యమ్నాయంగా స్ధలాలు సేకరించేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఆమేరకు ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన జెడ్పిటిసిలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author