NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రంలోని మహిళా మండలి పొదుపు సమాఖ్య ప్రాంగణంలో శుక్రవారం ఉదయం సహకార సొసైటీ చైర్మెన్ టి.నాగ తులసి రెడ్డి ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి ప్రారంభించారు.ఏపీ మార్క్ ఫెడ్/రాఫిడ్ ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరపై శనగల కొనుగోలును రైతుల వద్ద నుండి శనగలను కొంటున్నారు.శనగలు క్వింటం ధర 5,335 రూపాయలతో శనగలు కొంటున్నామని సొసైటీ చైర్మన్ తులసి రెడ్డి అన్నారు.మండలంలోని వివిధ గ్రామాలలో శనగ రైతులు ఎవరైనా ఉంటే ఈకేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షులు నబి రసూల్, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,సొసైటీ సీఈఓ గిరిరెడ్డి,తువ్వా రామ నాగేశ్వరరెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

About Author