PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెడ్పీటీసీ నరేన్​ జన్మదినం..అభిమానుల సందడి…

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు, యువ నాయకులు చింతకొమ్మదిన్నె జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ..మండల వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మండల వైఎస్ఆర్సిపి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం ఉదయం 10 గంటలకు, స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైయస్సార్ సిపి యువ నాయకులు పెడబల్లె ప్రదీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, ఉంటుందని అలాగే రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందని, అనంతరం ఆసుపత్రికి స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసింది, ఈ విధంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సత్యరాజు ఆధ్వర్యంలో చెన్నూరు టౌన్ కొత్త రోడ్ పైన నరేన్ రామాంజనేయ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద బెలూన్ ఏర్పాటు చేయడం జరిగింది, అనంతరం సాయి, శ్రీకాంత్ అమర్, శ్రీనివాసులు రెడ్డి, ల తో కలసి వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు దాదాపు 20 మందితో రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు, కాగా వీరంతా కూడా గురువారం రాత్రి బాణాసంచా పేలుస్తూ, భారీ కేక్ కట్ చేసి యువ నాయకుల జన్మ దినోత్సవాన్ని అంబరాన్ని అంటిన సంబరంల చేయడం జరిగింది.

About Author