లక్ష రూ.ల మంజూరు పత్రం అందజేసిన జెడ్పిటిసి
1 min read-పేదలకు వరం కళ్యాణమస్తు పథకం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదింటి బిడ్డల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వైయస్సార్ కళ్యాణమస్తు పథకం పేదలకు వరమని జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని మాసపేట సచివాలయం దగ్గర వైఎస్సార్ షాదీ తోఫా/కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఉప్పలదడియ గ్రామానికి చెందిన వధువు కొమ్ము శ్వేత గారి తల్లి కొమ్ము రాణెమ్మ తండ్రి కొమ్ము శేఖర్ గారి ఖాతా నందు ఒక లక్ష రూ.ల నగదు జమచెయ్యడం జరిగింది. మంజూరు అయిన కళ్యాణమస్తు లక్ష రూపాయల నగదు పత్రాన్ని మండల జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మరియు సర్పంచ్ శంషున్ బి,ఎంపీటీసీ కమతం జయమ్మ,వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి అస్రఫ్ భాష నగదు పత్రాన్నివారికి అందజేశారు.ఈపథకo వల్ల పేదల పెళ్లి ఖర్చులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని వారు అన్నారు.ఈకార్యక్రమంలో ఎల్లారెడ్డి, రామసుబ్బారెడ్డి,అన్వర్ భాష,వెల్ఫేర్ అసిస్టెంట్ తేజేశ్వర్,డిజిటల్ అసిస్టెంట్ పాల్గున తదితరులు పాల్గొన్నారు.