అమ్మకానికి 10వేల హోటళ్లు !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. ఒక్కో రంగానిది ఒక్కో ధీనగాథ. లాక్ డౌన్ తో వివిధ రంగాలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యాయి. అలాంటి రంగాల్లో హోటళ్ల రంగం కూడ ఒకటి. కర్ణాటకలో హోటళ్ల రంగం తీవ్రంగా దెబ్బతినిందనడానికి ఉదాహరణ.. హోటళ్ల అమ్మకమే. రాష్ట్రంలో గుర్తింపు ఉన్న 10 వేల హోటళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నా సరే.. 10 నుంచి 15 శాతం హోటళ్లు తెరిచేందుకు హోటళ్ల యజమానులు సుముఖంగా లేరని తెలుస్తోంది. బెంగళూరులో 25వేల హోటళ్లు ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల హోటళ్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల హోటళ్లు అమ్మకానికి ఉన్నాయని, ఒక్క బెంగళూరులోనే 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్నట్టు తెలుస్తోంది.