ఎస్డి పీ ఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తల సమావేశం
1 min read

న్యూస్ నేడు హొళగుంద: సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కర్నూల్ జిల్లాహొళగుంద మండలం ఎస్బి ఫంక్షన్ హాల్ నందు ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులుఎఫ్. హమీద్ , ప్రధాన కార్యదర్శి కె. అబ్దుల్ రెహ్మాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు వక్ఫ్ అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అబ్దుస్ సుభాన్ , ఎమ్మిగనూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు మౌలానజహీర్ హాఫిసాబ్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్.అబ్దుస్ సుభాన్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం -2025 భారత రాజ్యాంగానికి విరుద్ధమని, ఈ చట్టం ద్వారా మైనారిటీలైన ముస్లిం సమాజానికి కలిగే నష్టలను గురించి అవగాహన తేలియపరచడం జరిగింది, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అణగారిన వర్గాలకు స్వేచ్ఛ,న్యాయం, రక్షణ, సమానత్వం మరియు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందు వరుసలో ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లి అధ్యక్షులు యఫ్, హమీద్ మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ దేశంలో ఎక్కడ అన్నయ్యం జరిగిన మొదట గొంతు విప్పే ఏకైక పార్టీ ఎస్డిపిఐ పార్టీ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు సలాం కార్యదర్శి , హఫీజ్ సభ్యులు ఫజిల్ ,అస్లమ్ ,హరూన్ ,అల్లబకష్ , రహమతుల్లా మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.

