ఉపాధ్యాయుల కు 40 రోజుల ఉచిత ఆన్లైన్ ఆంగ్ల భాష భోధన తరగతులు
1 min read
కర్నూలు, న్యూస నేడు: జిల్లా డిఈఓ గ సహకారం తో Will2can ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ శ్రీ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక రోజు ఒరిఏన్టేషన్ కార్యక్రమం ను కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియం లో నిర్వహించారు .ఈ కార్యక్రమం లో దాదాపు 450 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరు అయ్యారు, ఈ సందర్బంగా నిర్వాహకులు, ట్రైనర్ రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఈ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం గవర్నమెంట్ పాఠశాల లో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడేలా చేయటం అన్నారు. ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ గా తరగతులు కు హాజరు కావడం పట్ల వారు సంతోషంను వ్యక్తం చేశారు, ఆయన ఇప్పటి వరకు తెలంగాణ లో 33 జిల్లా ల్లో 53 వేల ఉపాధ్యాయుల కు ఈ తరగతులు పూర్తి చేశా మని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ని గవర్నమెంట్ స్కూల్ లో చదివే ప్రతి విద్యార్థి తెలుగు మాట్లాడువిధంగా ఇంగ్లీష్ ను మాట్లాడేల చేయడం అని ఇందులో భాగంగా మొదట విశాఖపట్నం మరియు అన్నమయ్య , అనంతపురం శ్రీ సత్యసాయిజిల్లా ల్లో, జిల్లా విద్యా శాఖ సహకారం తో ఈ కార్యక్రమం అమలు చేయడం జరిగింది అని తెలిపారు. ప్రస్తుతం కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రభుత్వా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.దాదాపు 2500 మంది టీచర్స్ ప్రతి రోజు ఆన్లైన్ క్లాస్ కు హాజరు ఔతున్నారు. ప్రభుత్వ సహకారంతో మిగతా జిల్లా ల గవర్నమెంట్ టీచర్స్ కి కూడా ఈ శిక్షణ అందిస్తామన్నారు. ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాల్గొని ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సద్వినియోగపరచుకోవాలని అన్నారు జిల్లా సద్గురు అధ్యక్షులు డాక్టర్ కే వేణుగోపాల్ ఇది మహత్తరమైన కార్యక్రమాన్ని కొనియాడారు, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రోత్సహించిన ఏఎంఓ మరియు డివిజనల్ టూరిజం అధికారి లక్ష్మీనారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు అందరూ శ్రీ రామేశ్వర్ గౌడ్ ని శాలువా లతో సత్కరించారు.