NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దామోదరం సంజీయయ్య బాల సదన్ ను తనిఖీ చేసిన న్యాయమూర్తి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి , మంగళవారం నాడు పెద్దపాడు నందుగల  దామోదరం సంజీయయ్య బాల సదన్ ను  తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో బాలల సంక్షేమం కొరకు, వారికి న్యాయ సహాయం అందించడం కోసం ఎల్​ సమ్​ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. బాల సదన్ నందు పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఆరోగ్య మరియు సంరక్షణ గురించి తనిఖీ చేసారు. అనంతరం బాల సదన్ నందు భోజన శాల మరియు పిల్లల రూమ్ నందు పై కప్పు పేచ్చులు ఉడుతుండడాన్ని గమనించి అక్కడి అధికారిని విచారించాగా స్లాబుల రిపేర్ కోసం పంచాయతీరాజ్ శాఖ నుండి టెండర్లు పిలవడం జరిగిందని అమౌంట్ శాంక్షన్ అయిందని వారు జడ్జి కి తెలిపారు.

About Author