ఒకే రోజులో 44 తీర్పులు.. సుప్రీంలో రికార్డు !
1 min readపల్లెవెలుగువెబ్ : సుప్రీంకోర్టు ఒకే రోజులో 44 తీర్పులిచ్చింది. ఇది ఇటీవలి కాలంలో ఓ రికార్డు. వేసవి సెలవుల అనంతరం విచారణలు పునఃప్రారంభమైన జూలై 11న ఈ ఘనత నమోదైంది. ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చారు. మే 23 నుంచి జూలై 10 వరకు అత్యున్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు అనే విషయం తెలిసిందే. నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, దేశీయ చట్టాలు, క్రిమినల్ అపీళ్లు, సివిల్ వివాదాలు, బ్యాంకింగ్, వ్యాపార వివాదాలు, కోర్టు ధిక్కారం కేసులు, కాంట్రాక్టుల అమలు వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో ఈ తీర్పులు వచ్చాయి.