NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

4 జి సిమ్ ఒక్క రూపాయికే

1 min read

బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం ప్లాన్ ఆఫర్ తిరిగి ప్రవేశం

ఏప్రిల్ 30 వరకు  గడువు పొడిగింపు.

కర్నూలు, న్యూస్​ నేడు: బిఎస్ఎన్ఎల్  గత  ఆగస్టు లో స్వాతంత్ర్య దినోత్సవాలలో భాగంగా ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ ప్లాన్   ఆఫర్ ను  వినియోగదారుల నుండి వస్తున్న అధిక డిమాండ్ కు  అనుగుణంగా ఫ్రీడమ్  ప్లాన్ ఆఫర్ ను  తిరిగి ప్రవేశ పెట్టడం  జరిగిందని మరియు  ఏప్రిల్ 30  వరకు  గడువును పొడిగించిందని,  కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్  మేనేజర్  శ్రీ జి రమేష్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ ఫ్రీడమ్ ప్లాన్ లేదా ఆజాది కా ఆఫర్ ద్వారా వినియోగదారులకు ఉచితంగా 4 జి సిమ్ ను  ఇస్తూ కేవలం రూ .1/ – రీచార్జ్ ద్వారా 30 రోజులపాటు ప్రతిరోజు 2 జిబి డేటా,  అపరిమితమైన  వాయిస్ కాల్స్ మరియు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చని ;  ఈ ఆఫర్ కొత్తగా సిమ్ తీసుకునే వారికి మరియు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యే వారికి వర్తిస్తుందని తెలిపారు.  వినియోగదారులు దగ్గర్లో ఉన్న బిఎస్ఎన్ఎల్  వినియోగదారుల సేవా కేంద్రము లేదా రిటైలర్ను సందర్శించి ఈ ఆఫర్ ను పొందగలరు అని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి రమేష్  తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *