NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

1 min read

సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరo పునరంకిందమవుదాం..

జిల్లా పి.డి.పి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు

స్వేచ్ఛ, సమానత్వాలు, మన భారత రాజ్యాంగం ద్వారానే సిద్ధించింది..

ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పునరంకితమవుదామని ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు అసెంబ్లీ నియోజవకర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ బడేటి చంటిలు పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా టిడిపి కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలోనే మహోన్నత రాజ్యాంగం మనదని పేర్కొన్నారు. స్వేచ్ఛా, సమానత్వాలను రాజ్యాంగం మనకు ప్రసాదించిందన్నారు. ఏలూరు టిడిపి ఇన్‌ఛార్జ్‌ బడేటి చంటి మాట్లాడుతూ నేటి పాలకులు రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ ఫలాలను ప్రతిఒక్కరికీ అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చెప్పారు. ప్రపంచంలోనే మన రాజ్యాంగం ఎంతో గొప్పదని, డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాలి ప్రసాద్,పూజారి నిరంజన్, రెడ్డి నాగరాజు, పిల్లారిశెట్టి సంద్య, తంగిరాల సురేష్‌, దాకారపు రాజేశ్వరరావు, నెరుసు గంగరాజు, లంకపల్లి మాణిక్యాలరావు, పైడి వెంకటరావు, గన్ని గోపాలరావు, దూసనపూడి పుల్లయ్య నాయుడు, కళ్ళి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

About Author