హత్య కేసులో 8 మంది ముద్దాయిలు అరెస్టు..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బోయ మునీస్వామి, వయస్సు 31 సం.,లు తండ్రి పెద్ద బజారి, ఇంటి నంబర్ 4/298, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా 2) .బోయ శివ @ శివ రాముడు , వయస్సు 22 సం.,లు తండ్రి పెద్ద బజారి, ఇంటి నంబర్ 4/298, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా. 3) బోయ పెద్ద బజారి, వయస్సు 56 సం.,లు తండ్రి లేట్ చిన్న బోడేన్న ఇంటి నంబర్ 4/298, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా. 4) బోయ రాకేష్, వయస్సు 24 సంవత్సరములు, తండ్రి పేరు బోయ రంగన్న, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా.5) బోయ సురేశ్, వయస్సు 26 సం.,లు తండ్రి హనుమంతు, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము.6) కల్లపరి నాయుడు, వయస్సు 25 సం.,లు తందిర్ సోమప్ప, కల్లపరి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా 7) బోయ నాగరాజు, వయస్సు 22 సంవత్సరములు, తండ్రి పేరు బోయ కనిగిరి @ కాటిగాడు, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా, 8) బోయ బంగి తిమ్మప్ప, వయస్సు 30 సంవత్సరములు, తండ్రి పేరు బోయ సోడల రంగన్న, పులకుర్తి గ్రామము, కోడుమూర్ మండలము, కర్నూల్ జిల్లా. పై తెలిపిన ముద్దాయిలలో మొదటి ముద్దాయి బోయ మునిస్వామి మరియు ఫిర్యాది బోయ నడిపి రంగడు యొక్క మేనల్లుడు సురేష్ కు మధ్య గత ఒక సంవత్సరము నుంచి ఒక అమ్మాయి విషయంలో మరియు చిల్లర గలాటాల విషయంలో మనస్పర్ధలు ఉండి, ఒకరిని చూసి మరొకరు రెచ్చగొట్టుకుంటూ చూసుకుందాం అంటే చూసుకుందాం అంటూ ఉండి, ఇప్పటికి సుమారు రెండు నెలల క్రిందట అదే గ్రామమునకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనగా బోయ దస్తగిరి మరియు బోయ నరసింహుడు ఇద్దరు గంజెల్ల తిరుణాలలో గలాటాపడిన విషయంలో ఫిర్యాది మరియు సురేశ్ లు ఇద్దరు నరసింహులు అనే వానికి సపోర్ట్ చేయగా, ముద్దాయి మునిస్వామి దస్తగిరికి సపోర్టుగా ఉండి, ఇరువర్గాల వారు పంచాయతీ పెట్టుకుని సదరు పంచాయతీలో ఫిర్యాది మరియు సురేష్ ఇద్దరు ముద్దాయి మునుస్వామిని దొంగతనం చేసేవాడు అని దొంగ నా కొడుకు అని నీ మీద చాలా కేసులు ఉన్నాయి అని అందరి ముందు అవమానపరిచినందున, అందుకు మునుస్వామి ఫిర్యాది బోయ నడిపి రంగడు మరియు సురేష్ పైన కక్ష కట్టి వారిని చంపాలనే ఉద్దేశ్యంతో 26.04.2025 వ తేదీన రాత్రి 12 గంటలకు మునిస్వామి మరియు అతని స్నేహితుడు మహేశ్ లు మద్యము సేవించి సురేష్ ట్రాక్టర్ డ్రైవర్ సోమేశ్ వద్దకు వెళ్లి సురేష్ ఎక్కడున్నాడో చూపిస్తూ రా వాణ్ని చంపాలని అని చెప్పగా అందుకు అతడు నిరాకరించినందున అతన్ని కొట్టినాడు. ఆ విషయములో సోమేశ్ ఉదయము చనిపోయిన నడిపి రంగడుకు, సురేష్ కు చెప్పగా వారు మునుస్వామిని దండించినారు, ఆ విషయములో పంచాయితీ పెట్టుకుందాము రమణయ్య కల్లం దొడ్డి లోకి రమ్మని చెప్పగా, మునుస్వామి ఫోన్ చేసి ఎంతకు రానందున మధ్యాహ్నం రెండు గంటలకు చనిపోయిన బోయ రంగడు మొదటి ముద్దాయి మునుస్వామి కి ఫోన్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినందున అతడు అప్పటికే పథకము ప్రకారము పై తెలిపిన ముద్దాయిలు, చిన్నమారివీడుకు చెందిన కొందరు, యెమ్మిగనూర్ కు చెందిన మరి కొందరు పులకుర్తి గ్రామంలోని గూడూరు బస్ స్టాప్ వద్ద నడిపి రంగడు, సురేష్ లపైన నాటు కట్టెలతో, రాడ్లతో దాడి చేయగా ఆ దాడిలో నడిపి రంగడు తీవ్రముగా గాయపడి, 28.04.2025వ తేదీన తెల్లవారుజామున 4.15 గంటలకు కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చనిపోయినాడు. ఈ దినము అనగా 01.05.2025 వ తేదీన మధ్యాహ్నం 1:45 గంటలకు పై తెలిపిన ముద్దాయిలను Kodumur C.I ఎస్.చిరంజీవి కోడుమూర్ ఎస్.ఐ D.Y. స్వామి గూడూరు ఎస్.ఐ తిమ్మయ్య సిబ్బంది ASI 2302, HCs 2749, 2794, 219, PCs 1850, 263, 2133 HGs 127, 898 లతో పాటు అరెస్టు చేసి వారి వద్ద నుండి నాటు కట్టలు రాడ్లు మరియు మూడు మోటార్ సైకిల్ లను కేసు తదుపరి చర్య నిమిత్తము స్వాధీన పరచుకోవడం అయినది.