NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటు సారా స్థావరాలపై దాడులు

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  నవోదయము కార్యక్రమంలో భాగంగా నాటు సారా స్తావరాలపై దాడులు నిర్వహిస్తూ కల్లూరు మండలం కొల్లంపల్లి తండాకు సంబంధించిన శివారు ప్రాంతాల్లో నాటు సారాకు సంబంధించిన స్థావరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం జరిగినది. తదుపరి విచారణలో సంబంధిత నాటు సారాకు ఉపయోగించు బెల్లం ఊట  మరియు సంబంధిత బట్టీలు కనుగొని సుమారు 1000 లీటర్ల నాటు సారాకు ఉపయోగించు బెల్లం ఊట మరియు 30 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేయడం జరిగినది. తదుపరి వాటిని పరిశీలించగా లోకేష్ నాయక్ మరియు లక్ష్మణ నాయక్ లకు సంబంధించినదిగా తెలిసినది. కావున వీరిపై కేసు నమోదు చేయడమైనది. త్వరలో వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపడం జరుగుతుంది. నాటు సారా తయారు చేయడం అమ్మడం రవాణా చేయడం చట్టరీత్యా నేరం అని తెలుపుతూ ప్రతి సభలోను ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నాటుసారా పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేయుచున్న కృషికి అందరూ సహకరించాలని కోరుతూ నాటు సారాకు  సంబంధించిన సమాచారం ఇచ్చినట్లయితే గోప్యంగా ఉంచబడునని తెలియజేస్తూ నాటు సారాలేని గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేయడమైనది. ఈ దాడులలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు సిబ్బంది చంద్రపాల్, రాజు రామలింగయ్య, మధు, ఈరన్న పాల్గొన్నారు.

About Author