మధ్యాహ్నానికే 91 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణి
1 min read
పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి,పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.మంగళవారం ఏలూరు నగరంలో ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించి నగరంలో లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. పించనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు వివరించారు. జూలై మాసపు ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,58,098 మంది పించను దారులకు ప్రభుత్వం రూ. 112.72 కోట్లు విడుదల చేసిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికే 2,34,760 మంది పించనుదారులకు రూ. 102.16 కోట్లు(91శాతం) పంపిణీ చేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీకి 5,292 మంది సిబ్బంది ఉదయం 7.00 గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారన్నారు. జూలై 1వ తేదీన పింఛన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి జూలై 2వ తేదీ బుధవారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీరి వెంట ఏలూరు తహశీల్దారు గాయత్రీ,ఎస్సీ మాల ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, స్ధానిక టిడిపి నాయకులు,గుడిపూడి రవి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.