సైన్యంలోకి 98 ఏళ్ల బామ్మ.. తర్వాత ఏమైందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : 98 ఏళ్ల బామ్మ ఒకరు ఉక్రెయిన్ సైన్యంలో చేరడానికి ముందుకొచ్చింది. ఉక్రెయిన్ రక్షణశాఖ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌కు చెందిన ఓల్హా తెర్దో్క్లిబోవా అనే 98 ఏళ్ల వృద్ధురాలు సైన్యంలో చేరి, రష్యాపై పోరాడతానని చెప్పింది. ఆమె రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేసింది. ఆ అనుభవంతో ఇప్పుడు సైన్యంలో చేరతానని కోరింది. అయితే, వయసురీత్యా ఆమెను సైన్యంలో చేర్చుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీ నిరాకరించింది.