పవన్ ఎక్కడ పోటీ చేసినా.. ఓడిస్తాం !
1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇంచార్జి పోస్ట్ తీసుకుంటానని తెలిపారు. అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని ద్వారంపూడి అన్నారు. ద్వారంపూడి వ్యాఖ్యలు సంచలనాన్ని రేపుతున్నాయి.

